స్పందన కార్యక్రమంలో స్పందన కరువు: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నిరసిస్తూ చెపట్టినటువంటి భారీ నిరసన ర్యాలీ అనంతరం సోమవారం ఉదయం విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యల పైన స్పందన కార్యక్రమంలో వినతులు అందజేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో మొదటి సమస్యగా అల్లాడ పాలెం గ్రామంలో నాగావళి నది మీదుగా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్న ప్రైవేటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అలాగే తొంగుడుబల్లి గ్రామంలో ఎమ్మెల్యే కుమారుడి పేరు మీదగా అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా అరికట్టాలని జిల్లా కలెక్టర్ కి తెలియజేశారు. లోకం మాధవి మీడియా మిత్రులతో మాట్లాడుతూ అల్లాడ పాలెం గ్రామంలో గత మూడు నెలలుగా గ్రామస్తులకి మరియు ప్రైవేట్ జరుగుతున్న సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానిక నాయకులు గాని వారికి అండగా నిలబడకపోవటమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యమైన అరబిందో కంపెనీ మరియు మానస ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ విశాలమైనటువంటి వాగు ఆనుకొని దిగువ ప్రాంతమైన అల్లాడపాలం పైడిభీమవరం మరియు తదితర గ్రామాలకు కన్నతల్లి వలె బాసటగా నిలుస్తుందని, అయితే ఈ రోడ్డు వేయడం వలన కలిగే ప్రమాదాలు వరదలు, పర్యావరణ విపత్తులు జరిగినప్పుడు దిగువనున్న ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, అనివార్య కారణాల వలన పైపులు లీకై పంట పొలాలు నదీ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిని అరికట్టే వరకు తాము తీవ్రంగా పోరాడతామని తెలియజేశారు. అలాగే తొంగుడు బిల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొడుకు పేరు చెప్పి కనీసం పంచాయతీ నుండి అనుమతి కూడా లేకుండా అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని కట్టడి చేయాలని నిలువరించి ప్రకృతి అందించినటువంటి వనరులను కాపాడుకోవాలని లోకం మాధవి తెలియజేశారు. అలాగే స్పందన కార్యక్రమంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు అని దానికి ఉదాహరణ నియోజకవర్గంలోని గత నాలుగేళ్లగా పరిష్కారానికి నోచుకోని ఉన్న సమస్యలు కోకొల్లలు అని, వైసీపీ ప్రభుత్వ పాలనకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాధవి పేర్కొన్నారు.