ఆముదాలవలస లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన ఆవిర్భావంతో తాడిత పీడిత బాధిత ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆముదాలవలస జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పేడాడ రామ్మోహన రావు అన్నారు. శనివారం జనసేన 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఆముదాలవలస లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావంతో పేద ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 14న విజయవాడలో జరుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సమావేశంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీ అజెండాను ప్రకటించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటమే జనసేన లక్ష్యమని అన్నారు. 2024 లో జరుగు సాధారణ ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధం అవుతుందని దీంతో జనసేన అభ్యర్థుల విజయం తధ్యమని పలికారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పైడి మురళీ మోహన్ రావు, పి.ప్రసాదరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.