మొర్రిగూడ గ్రామంలో రోడ్డు సదుపాయం కల్పించాలి

*20 ఏళ్ళ కిందట వేసిన మట్టి రోడ్డు పూర్తిగ పాడైపోయింది వెంటనే తారు రోడ్డు మంజూరు చేయాలి మాదాల శ్రీరాములు జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికారప్రతినిది

విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం అరకు వేలి మండలం ఇరగాయి పంచాయితీ పరిధిలో మారుమూల గ్రామం మొర్రిగూడ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. లోతేరు నుండి మొర్రిగూడ గ్రామానికి వెళ్లాలంటే నరకం చూడవలిసి వస్తుంది. లోతేరు మీదుగా వయా తాంగులబెడ్డ, వాలిది, పనస, డవడగుడా, మొర్రిగూడ మరియు చందూర్ పొద వరకూ రోడ్డు వేస్తే ప్రజలకు అన్నివిధాల రాకపోకలకు.. వాహనాల మీద ఆయా గ్రామాలకు వెళ్లే వారికి బాగుంటుందని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ.. గత 20 ఏళ్ళ కిందట వేసిన మట్టిరోడ్డు హుద్ హుద్ తుపాన్ కి మొత్తం కొట్టుకొనిపోయింది. లోతేరు నుండి 7 కిలో మీటర్ల రోడ్డు మనుషులు నడవడానికి కూడా సరిగ్గా లేదు. రాళ్లు తేలిపోయింది. అడుగు కో గుంత గాజానికో గొయ్యి అన్నట్టు మొర్రిగూడ రోడ్డు అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎన్నోసార్లు నాయకులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా.. ప్రజాప్రతినిధులు పట్టించు కోవడం లేదు. ప్రతీ ఎన్నికలకు మాత్రమే ప్రజాప్రతినిధులు వస్తారు.. హామిలిస్తారు.. వేస్తామంటారు.. కానీ రోడ్లు వేయడం మానేశారు. ప్రజల ఇబ్బందులు ప్రజా ప్రతినిధులకు తెలియదా అని ఈ సందర్భముగా జనసేనపార్టీ నాయకుడు మాదాల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, బిమిడి మత్యరాజు, గ్రామస్తులు మహిళలు పెద్దఎత్తున పాల్గొని మా గ్రామానికి రోడ్డు కావాలని నిరశన తెలిపారు.