చెన్నై టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ..

భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ జట్టును ఆదుకోవడమే కాకుండా, తన ఫామ్ పై వ్యక్తమవుతున్న సందేహాలను పటాపంచలు చేస్తూ శతకం సాధించాడు. 130 బంతుల్లో 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 7వ సెంచరీ. కాగా రోహిత్ స్కోరులో 14 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా… రోహిత్ శర్మ, రహానే జోడీ భాగస్వామ్యంతో కోలుకుంది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 44 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 108, రహానే 27 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్ శుభ్ మాన్ గిల్, కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యారు. పుజారా 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోన్, లీచ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.