“ఆరెంజ్” చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన రూ.1.05 కోట్లు జనసేనకు మద్దతుగా అందజేత
“అంజనా ప్రొడక్షన్స్” పతాకంపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు నిర్మించిన “ఆరెంజ్” చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించటం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1.05 కోట్లు జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారు చెక్కు రూపంలో ఈ మొత్తం అందజేశారు. “ఆరెంజ్” చలన చిత్రం రెండవ సారి విడుదల చేసి ప్రదర్శించేందుకు కీలక భూమిక పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కే.ఎన్., శివచెర్రీ, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు.