క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకం

• సభ్యత్వ పత్రాల ప్రదాన కార్యక్రమం విజయవంతం
జనసేన పార్టీ నిర్మాణంలో క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకమైనదని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ ప్రజాపక్షం వహిస్తూ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో, పార్టీ విధివిధానాలను ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడంలో క్రియాశీలక సభ్యుల భాగస్వామ్యం అవసరం. జనసేన కుటుంబంలో భాగమైన వారి కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడమైంది. ఈ ఏడాది చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా చేరారు. 7225మంది పార్టీ వాలంటీర్లు సభ్యత్వ నమోదులో పాలుపంచుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలతో కూడిన కిట్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగడం సంతోషాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా, నగర, మండల కమిటీల సభ్యులు, వీర మహిళ కమిటీ సమన్వయకర్తలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ, చేనేత, మత్స్యకార, డాక్టర్స్, లీగల్ విభాగాల చైర్మన్లు, సభ్యులు, అధికార ప్రతినిధులు, వీరమహిళలు, జనసైనికులకు హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలోను క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీని విజవంతంగా చేపట్టిన నాయకులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత ముందుకు తీసుకువెళ్దాం అని జనసేనాని పేర్కొన్నారు.