రైతు సౌభాగ్యం జనసేనతోనే సాధ్యం: మాకినీడి

  • రక్తంతో నేలను దున్ని, శ్వేదంతో సేద్యం చేసే రైతుకి పాదాభివందనం .. మాకినీడి శేషుకూమారి

పిఠాపురం: జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, పి.ఎ.సి సభ్యులు కొణిదెల నాగబాబు పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పిఠాపురం మండలం, కొత్త సింహాద్రిపురం, దొంతమూరు మరియు గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ క్షేత్రంలో రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచి, రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ అధికారం లేకపోయినా రైతులకు పెద్దపీట వేస్తూ, వారిని కష్ట కాలంలో ఆదుకుంటున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పవన్ కళ్యాణ్ సొంత కష్టార్జితంతో కుటుంబానికి లక్ష చొప్పున అరవై కోట్ల యాభై లక్షలు 650 కుటుంబానికి సాయంచేశారు, అలాంటి కళ్యాణ్ ని అందలం ఎక్కిస్తే రైతులకు పెద్దపీట వేస్తారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి రైతుకూ నెలకు 5000/- పింఛను ఇచ్చి వారికి బాసటగా నిలుస్తారు అన్నారు. రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుందనీ, రైతులను కృంగిపోవద్దనీ, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవగానే రైతే రాజు అని నిరూపిస్తామని భరోసానిచ్చారు. రైతే రాజు అనే నినాదంతో గెలిచిన వైసిపి పార్టీ గెలిచిన తర్వాత రైతు వెన్నుముక విరిచే స్థాయికి దిగజారారు. నకిలీ విత్తనాలు, దళారులకు కొమ్ము కాస్తూ పండిన పంట కొనుగోలు చెయ్యకుండా రైతులకు కన్నీరు పెట్టిస్తున్నారు. రాజుగా బ్రతకాల్సిన రైతు నేడు దీనస్థితిలో ఉండడానికి కారణం ప్రభుత్వ తీరేనని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అరికట్టి, దిగుబడి వచ్చిన పంటను కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఏనుగంటి హరిబాబు, బుర్రా సూర్యప్రకాష్, కర్రి హరిబాబు, దాసం కొండబాబు, గారపాటి శివ కొండారావు, రౌతు శివ బాబు, నామా సాయి బాబు, కసిరెడ్డి నాగేశ్వరరావు, కంద సోమరాజు, గుడాల ఏడుకొండలు, దార సత్తిబాబు, చక్రవర్తుల స్వామి, కొత్త రాజా, చింతల సతీష్ కుమార్, పళ్ళ సందీప్, నాగిరెడ్డి శ్రీను, దాసం బుజ్జి, అడబాల శివ, రైతు సోదరులు, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.