55వ వసంతంలోకి అడుగుపెట్టిన సల్మాన్.. నిరాడంబరంగా బర్త్ డే వేడుక

బాలీవుడ్ కండలవీరుడు స్టార్ సల్మాన్ ఖాన్ నేడు 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు ప్రముఖులు సల్మాన్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ప్రతి ఏడాది సల్మాన్ ఇంటి వద్దకు అభిమానులు వచ్చి శుభాకాంక్షలు తెలిపే అలవాటు ఉండగా.. ఈ సారి కరోనా కారణంగా తన ఇంటికి ఎవరు రావొద్దని విజ్ఞప్తి చేశారు సల్మాన్. ఈ మేరకు ఇంటి ముందు బ్యానర్‌ ఏర్పాటు చేశాడు. కరోనా వలన ఈ సంవత్సరం పరిణామాలు చాలా భిన్నంగా ఉన్నాయని, అందుకు ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమైతే మంచిదని అభ్యర్ధించాడు సల్మాన్.

ఇక తన 55వ బర్త్‌డే వేడుకలని సల్మాన్ పన్వెల్ ఫాం హౌజ్‌లో నిరాడంబరంగా జరుపుకున్నాడు. కొద్ది మంది శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకోగా, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ 14సీజన్‌ షో నిర్వహిస్తున్నాడు. అలానే ‘అంథిమ్‌: ది ఫైనల్ ట్రూత్‌’ చిత్రీకరణలో ఉన్నారు.