”బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి” ట్రైలర్ ని రిలీజ్ చేసిన సమంత

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ”బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి”  సినిమాను తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో లేటెస్టుగా ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ ట్రైలర్ విడుదల చేశారు.  సమంత ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ట్వీట్ చేసింది.  కాగా 1994లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది.. కానీ నా కథ నా చావుతో మొదలైంది’ అనే డైలాగ్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.