ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి కొవిడ్‌-19 బీమా

కొవిడ్-19 బీమా వర్తింపజేయాలని ఏపీఎస్ ఆర్టీసీ గత కొద్ది రోజులుగా యాజమాన్యాన్ని డిమాండ్  చేస్తూ వస్తుoడగా. కార్మికుల డిమాండ్‌కు ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఆర్టీసీలో పనిచేసే సిబ్బందికి రూ.50 లక్షల కొవిడ్‌-19 బీమా ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన 36 మంది సిబ్బందికి ఈ బీమా ప్రయోజనాలు వర్తించనున్నాయి ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కరోనావైరస్తో చనిపోయిన వారి పూర్తి వివరాలు, వారి ఉద్యోగం, మరణ ధృవపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆర్టీసీ ఎండీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ సిబ్బందికి కూడా కొవిడ్-19 ఆరోగ్య బీమా వర్తింపజేయడంపై కార్మిక పరిషత్‌ సహా ఇతర ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ మేరకు వారు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.