సంజీవిని బ‌స్సును ప‌రీక్ష‌ల కోసం స‌ద్వినియోగం

కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకునే వారు నేడు కొత్త బ‌స్టాండు వ‌ద్ద అందుబాటులో ఉండే సంజీవిని బ‌స్సును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మున్సిప‌ల్ క‌మిస‌న‌ర్ సుబ్బ‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ కోవిడ్‌19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశాలున్నాయ‌న్నారు. ప్ర‌తి అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ ప‌రిధిలోని కోవిడ్‌19 ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి కుటుంబ స‌భ్యులను, ప‌రిస‌రాల్లో ఉన్న వారిని ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంట్యాక్ట్స్  కూడా ప‌రీక్ష‌లు చేసేందుకు ఈ సంజీవిని బ‌స్సు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌స్సులో ప‌రీక్ష‌ల‌ను సాయంత్రం వ‌ర‌కు చేస్తార‌ని తెలిపారు. రెండు రోజులుగా జ్వ‌రం ఉండి, శ్వాస‌, గుండె, కిడ్ని సంబంధిత వ్యాధులు గ‌ల వారు కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని సూచించారు.