పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీకి లేదు

రాజంపేట, ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వారు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాల మీద వారు చేస్తున్న తప్పిదాలను అలాగే వారి పరిపాలన వైఫల్యం వల్ల వాళ్లకు రాబోవు ఎన్నికల్లో ఇన్ని సీట్లకే ప్రజలు మిమ్మల్ని పరిమితం చేస్తారని అలాగే కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడిన వెంటనే కొందరు దుష్టశక్తులు మేము కుక్కతో విశ్వాసంలో కూడా పోటీ పడతామని చెప్పుకునే వారు అదే పనిగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆదివారం అయిపోయినప్పటి నుంచీ ఒకరి తర్వాత ఒకరు పోటీపడి మరి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. మీరు ఆయనను వ్యక్తిగతంగా దూషించే అంతటి అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరే అద్దం ముందర నిలబడుకొని ప్రశ్నించుకొని ఆ తరువాత మా పవన్ కళ్యాణ్ ని విమర్శించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రశ్నించే వారు… ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అన్నారు. ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం అప్పట్లో ప్రజారాజ్యం మన చిరంజీవి పెట్టిన పార్టీలో ఎంతోమంది మీలాంటి వాళ్లకి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. దేనికి పనికిరాని వాళ్ళు చాలామంది పనికొచ్చే వాళ్ళు చాలామంది పేదలకి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎంతమంది ఆయన ఇచ్చాడు అలాగే పనికిరాని వాళ్ళు మీలాంటి వాళ్ళకి కొందరికి పదవులు ఆయన పుణ్యమా అని చెప్పి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు మీకు రాజకీయ భవిష్యత్తు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది కులం కార్డు వాడుకొని ఎంతవరకు పైకి రావాలనే మీ ఆలోచనలు తప్ప కుల, మతాలకతీతంగా పార్టీలు నడవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరిక ఆయనకు మీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దయచేసి విధానపరంగానే ఏదైనా సబ్జెక్టు సబ్జెక్టు మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణ తగవని మేము వ్యక్తిగత దూషణలు చేయగలమని కానీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ సంస్కారం నేర్పించారు కాబట్టి క్రమశిక్షణగా మేము ఉన్నామని తెలియజేస్తున్నాం. జనసేన అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం మన అంబేద్కర్ ఎంత కృషి చేశారో ఆయన స్ఫూర్తితో అలాగే తెగింపులో మన ప్రాణాలైనా అర్పించి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి ప్రాణాలు అర్పించిన పోరాట యోధులు భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళ స్ఫూర్తితో మా పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల ముందే సీఎం పిఎఫ్ ఏర్పాటు చేశారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయన అలా అప్పటినుంచి సేవాగుణం కలిగిన వారు ఏదో మార్పు తీసుకురావాలనే నిరంతరం తపించే వ్యక్తి ఆయనను మీరు విమర్శించే స్థాయి కలిగిన వారు కాదని తెలియజేస్తున్నాం
అలా మార్పు కోసం వచ్చిన మా చిరంజీవి ఆశయాలను గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ప్రెస్సర్ పెట్టి మానసికంగా ఆయనకు ఒత్తిడి తెచ్చి పార్టీ విలీనం చేసే విధంగా చేశారే తప్ప మార్పు కోసమే ఆయన చూశాడు ఎప్పుడు సీట్లు అమ్ముకోలా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. ఆయన ఆశయాలు మార్పుని తీసుకురావాలని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మార్పు కోసం కృషి చేస్తూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీలాగా కోట్లు, కోట్లు గుమ్మరించి జనాల్ని పప్పులు బెల్లాలుగా కొని ఓట్లు వేయించుకొని అధికారం తెచ్చుకొని అధికారం తెచ్చుకున్నాకన్నా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేస్తున్నారా అంటే అది కూడా చేయడం లేదు మీరు మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు అంటే ఇది హాస్యాస్పదంగా ఉంది అన్నిటికన్నా మించి మీ నాయకులు,మీ కార్యకర్తలు మీ దాంట్లో సర్పంచులుగా గెలిచిన వాళ్లే ఎంతోమంది మాకు వద్దురా ఈ పరిపాలన మేమెందుకురా ఓటు వేశామని చెప్పి చెప్పులతో కొట్టుకున్న వీడియోలు చాలానే ఉన్నాయి. బహిర్గతంగానే కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది మీరు గ్రహించాలి అంటే మన పరిపాలన అంత బంగారంగా ఉందని, ఎంత బంగారంగా ఉందో మీ దృష్టికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే బాగుండదని గంటాపదంగా చెప్తున్నాం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గురివిగారి వాసు జనసేన ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు రమణ, ఈశ్వర్, తిప్పాయపల్లి ప్రశాంత్, సాయి, హరీష్, మంకు వెంకటేష్, ఉల్లి ఉపేంద్ర, నరహరి, ఎద్దల నరసింహా, గణేష్, శ్రీను, సుబ్బు కొంతమంది జనసేన సైనికులు పాల్గొన్నారు.