అగ్రవర్ణ కులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

  • అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణ కులస్తులపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించిన జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్
  • 25 లక్షల విలువ చేసే దళితుల భూమిని కాపాడిన ఒకే ఒక్కడు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు ఆనకట్ట వేసి, చమటలు పట్టించిన జనసైనికుడు

పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు మహేంద్ర(ఎస్సీ మాల) యొక్క భూమిని ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన, మరియు అధికార పార్టీకి చెందిన అగ్రకులస్తులు ఏడుగురు కలిసి అధికారం ఉందన్న గర్వంతోటి నల్లపు మహేంద్ర భూమిని ఆక్రమించి వారి కుటుంబ సభ్యులను తిట్టి మరియు కొట్టడం జరిగింది.

నల్లపు మహేంద్రకు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” అండగా నిలబడి ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన అగ్రకులస్తులపైన ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి ఎఫ్.ఐ.ఆర్ కాఫీ కూడా తీసుకోవడం జరిగింది.

ముండ్లమురివారిపాలెం గ్రామ అగ్ర కులస్తులు అయినటువంటి

  1. తానికొండ సుబ్బారావు తండ్రి నారాయణ
  2. నల్లూరి కోటయ్య తండ్రి నరసయ్య
  3. నల్లూరి బాలకోటు తండ్రి పెద్ద కొండయ్య
  4. నల్లూరి శ్రీను తండ్రి చినకొండయ్య
  5. తానికొండ సుంధరరావు తండ్రి నారాయణ
  6. నల్లూరి రోశయ్య
  7. ముప్పరాజు యలమంద తండ్రి సుబ్బయ్య

పైన తెలిపిన ఏడుగురు పైన శనివారం కేసు నమోదు అయింది.