ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: టైపిస్ట్-01, రికార్డ్ అసిస్టెంట్-02, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-01, డ్రాఫ్ట్స్‌మన్-01, అటెండర్-02, గార్డెనర్-02, మెస్ బాయ్/మెయిడ్-06, సెక్యూరిటీ గార్డ్-07, పంప్ అటెండర్-04, కార్పెంటర్-01, ప్లంబర్-03, బాయిలర్-01, ఎలక్ట్రీషియన్-01, వైండర్-01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ(డ్రాఫ్ట్స్‌మెన్), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
వెబ్‌సైట్: andhrauniversity.edu.in