నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

NFL Recruitment 2021: నేషనల్‌ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎఫ్ఎల్ మొత్తం 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

మొత్తం పోస్టులు: 23

నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఇంజినీర్ 2, అకౌంట్స్ ఆఫీసర్ 7, అసిస్టెంట్ మేనేజర్ 4, మెటీరియల్స్ ఆఫీసర్ 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.

 అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 26, 2021   

దరఖాస్తులకు ఆఖరు తేదీ: జూన్ 25, 2021   

పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..