ఢిల్లీలో వారంరోజుల పాటు పాఠశాలలు మూసివేత

వాయు కాలుష్యం నేపథ్యంలో సోమవారం నుండి వారంరోజుల పాటు పాఠశాలలు మూసివేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. వాయు కాలుష్యం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఎం ఈనిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేస్తామని అన్నారు. ప్రైవేట్‌ కార్యాలయలను ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తామని అన్నారు. ఈ నె 14 నుండి 17 వరకూ రాష్ట్రంలోని నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నామని, పొరుగు రాష్ట్రాల్లో కూడా పంట వ్యర్థాలు తగుల బెట్టకుండా చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు తమ వాహనాల వినియోగాన్ని కనీసం 30 శాతం తగ్గించుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని ప్రజలకు సూచించింది.