జులై 1 నుంచి స్కూల్స్.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్

తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభం కాబోతున్నాయి. జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అయితే అతి త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ముంచుకురావోతుందన్న వార్తలు విద్యార్థులను, అటు తల్లిదండ్రులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ప్రారంభమైతే ఎలాంటి ముప్పు పొంచి ఉందోనన్న ఆందోళన ఇటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో నేరుగా ప్రత్యక్ష తరగతులకు సర్కారు అనుమతించడంపై విద్యాశాఖలోని ఉన్నతాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం.. కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలకు ప్రమాదకరం అంటూ హెచ్చరికలొచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది! సర్కారు నిర్ణయంతో జూలై 1 నుంచి కేజీ టు పీజీ దాకా అన్ని రకాల విద్యాసంస్థలకు పిల్లలు హాజరయ్యే అవకాశాలున్నాయి.