సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన శేరిలింగంపల్లి జనసేన

శేరిలింగంపల్లి, బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి అందించిన సేవలు ఎంతో విలువైనవి ఆనాటి సాంఘీక అసమానతలను దైర్యంగా ఎదుర్కొని మహిళలకు విద్యావకాశాల కోసం పోరాడిన గొప్ప సంఘ సేవకురాలు అని తెలియచేశారు. నేటి సమాజంలో బుుతువులు మారినా మహిళలపట్ల అసమానతలు ఇంకా మారలేదని, వాటికి ధీటుగా నాటి సావిత్రిబాయి పూలే పోరాటం మహిళలకు స్పూర్తి తీసుకుని మహిళలు చదువుకొని అభివృద్దిపథంలో అన్ని రంగాలలో పురోగమించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గోన్నారు.