అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలు వెలకట్టలేనివి: డాక్టర్ ఎస్పీ.రవీంద్ర

  • వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్పీ.రవీంద్ర
  • అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎస్పీ రవీంద్ర సందర్శన
  • అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలను కొనియాడినన వాకర్స్ఇంటర్నేషనల్

విజయనగరం:అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ పరిధిలో అయ్యన్న పేట జంక్షన్ వద్దనున్న ఎస్సీ, బీసీ కాలనీలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎస్పీ రవీంద్ర మంగళవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలు అభినందనీయమని,తెలుగు సినిమాకు పెద్ద దిక్కైన మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో పెట్టిన ఈ వాకర్స్ క్లబ్ సేవలు వెలకట్టలేనివని, అనతి కాలంలోనే అత్యధిక సేవాకార్యక్రమాలు చేబడుతూ పలు సేవా సంఘాలకు ఆదర్శంగా ఉందనటంలో అతిశయోక్తి కాదని క్లబ్ సేవలను కొనియాడారు. పలువురు పాదచారులకు మజ్జిగను ఆయన పంచిపెట్టారు. అనంతరం క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) డాక్టర్ ఎస్పీ రవీంద్రను మరియు క్లబ్ పెద్దలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం, మాజీ గవర్నర్లు జి.కృష్ణం రాజు, కె.ఎర్నాయుడు,శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లూరి శ్రీనివాసరావు(సి.హెచ్.రమణ), బాలాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రామరాజు, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాస్టారు, క్లబ్ గౌరవ సలహాదారులు ఎ.తిరుపతిరావు, వాకార్స్ క్లబ్ పెద్దలు ఆర్.సి.హెచ్.అప్పల నాయుడు, తాడ్డి ఆదినారాయణ, పత్రి సాయి, యోగా గురువు చక్రధర్ పట్నాయక్, కోట్ల సత్యనారాయణ, నలమారాజు తదితరులు పాల్గొన్నారు.