మీడియా సోదరులకు సంఘీభావం తెలిపిన శేషుబాబు

అవనిగడ్డ, సభ్య సమాజం తలదించుకునే విధంగా మన శాసన సభ్యులు, షాడో శాసన సభ్యులు మాట్లాడినట్లు మా దృష్టికి వచ్చింది. అది కూడా స్థానికంగా ఉన్నటువంటి మీడియా సోదరుడి మీద మహిళలు వినకూడనటువంటి బూతులు తిడుతూ కొట్టటానికి మీదకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆ తిట్టిన వారికి తగినంత జ్ఞానం కలిగించాలని ఆ లంకమ్మ తల్లిని జనసేన పార్టీ తరుపున వేడుకుంటున్నాము. అలాగే ఈ నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు జనసేన పార్టీ తరుపున పూర్తి సంఘీభావం తెలుపుతున్నాము. ఒక సామాన్యునికి ఏదయినా నష్టం జరిగితే వారి తరుపున ఏ విధంగా అయితే పోరాడతామో అదే విధంగా ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా మీతో పాటు ఉండి పోరాడటానికి నియోజకవర్గ జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది అని తెలియ పరుస్తూ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము. ఈ విషయంలో మీ సాక్షి మీడియా సోదరులకు ఏదయినా నష్టం జరిగినా కూడా జనసేన పార్టీ తరుపున మేము మద్దతుగా ఉంటామని తెలియచేస్తున్నాము.