పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే బాగుండదని హెచ్చరించిన షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా విలేఖరుతో మాట్లాడుతూ గత ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు వారు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాల మీద వారు చేస్తున్న తప్పిదాలను అలాగే వారి పరిపాలన వైఫల్యం వల్ల వాళ్లకు రాబోవు ఎన్నికల్లో ఇన్ని సీట్లకే ప్రజలు మిమ్మల్ని పరిమితం చేస్తారని అలాగే కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడిన వెంటనే కొందరు వైసిపి మాజీ మంత్రులు, మనం ముద్దుగా పిలుచుకొనే, పేద పాలేరు గాడు, గుళ్ళ దగ్గర కొబ్బరి చిప్పలు వెరుకొనే వాళ్ళు పేర్ని నాని, వెలంపల్లి, శ్రీనివాస్ మరియు తాజా జబర్దస్త్ రోజా మేము కుక్కతో విశ్వాసంలో కూడా పోటీ పడతామని చెప్పుకునే వారు అదే పనిగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆదివారం అయిపోయినప్పటి నుంచీ ఒకరి తర్వాత ఒకరు పోటీపడి మరి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు మీరు ఆయనను వ్యక్తిగతంగా దూషించే అంతటి అర్హత మీకు ఉందా లేదా అని మిమ్మల్ని మీరే అద్దం ముందర నిలబడుకొని ప్రశ్నించుకొని ఆ తరువాత మా పవన్ కళ్యాణ్ ని విమర్శించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రశ్నించే వారు ఒక మాజీ వెల్లులి మాజీమంత్రి మాట్లాడుతూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అన్నారు, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. అప్పట్లో ప్రజారాజ్యం మన చిరంజీవి పెట్టిన పార్టీలో ఎంతోమంది మీలాంటి వాళ్లకి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. దేనికి పనికిరాని వాళ్ళు చాలామంది పనికొచ్చే వాళ్ళు చాలామంది పేదలకి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎంతమంది ఆయన టిక్కెట్లు ఇచ్చాడు అలాగే పనికిరాని వాళ్ళు మీలాంటి వాళ్ళకి కొందరికి పదవులు ఆయన పుణ్యమా అని చెప్పి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు మీకు రాజకీయ భవిష్యత్తు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది కులం కార్డు వాడుకొని ఎంతవరకు పైకి రావాలనే మీ ఆలోచనలు తప్ప కుల, మతాలకతీతంగా పార్టీలు నడవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరిక ఆయనకు మీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దయచేసి విధానపరంగానే ఏదైనా సబ్జెక్టు మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణ తగవని మేము వ్యక్తిగత దూషణలు చేయగలమని కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంస్కారం నేర్పించారు కాబట్టి క్రమశిక్షణగా మేము ఉన్నామని తెలియజేస్తున్నాం జనసేన అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం మన అంబేద్కర్ ఎంత కృషి చేశారో ఆయన స్ఫూర్తితో అలాగే తెగింపులో మన ప్రాణాలైనా అర్పించి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి ప్రాణాలు అర్పించిన పోరాట యోధులు భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళ స్ఫూర్తితో మా పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల ముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆయన అలా అప్పటినుంచి సేవాగుణం కలిగిన వారు ఏదో మార్పు తీసుకురావాలనే నిరంతరం తపించే వ్యక్తి ఆయనను మీరు విమర్శించే స్థాయి కలిగిన వారు కాదని తెలియజేస్తున్నాం. అలా మార్పు కోసం వచ్చిన మా చిరంజీవి ఆశయాలను గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు మానసికంగా ఒత్తిడి తెచ్చి పార్టీ విలీనం చేసే విధంగా చేశారే తప్ప మార్పు కోసమే ఆయన చూశాడు ఎప్పుడు సీట్లు అమ్ముకోలా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన వెన్నుపోటు పొడిచారు అంటున్నారు ఆయన ఆశయాలు మార్పుని తీసుకురావాలని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మార్పు కోసం కృషి చేస్తూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీలాగా కోట్లు, కోట్లు గుమ్మరించి జనాల్ని, డబ్బులు, మద్యం, ఉచిత పథకాలు అమలు చేసి, పప్పులు బెల్లాలుగా కొని ఓట్లు వేయించుకొని అధికారం తెచ్చుకొని అధికారం తెచ్చుకున్నాకన్నా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేస్తున్నారా అంటే అది కూడా చేయడం లేదు మీరు మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మేము కూడా మీ నాయకుడు జగన్ రెడ్డి, మీ జీవిత చరిత్ర బయటపెడతామని, హెచ్చరిస్తున్నా, అన్నిటికన్నా మించి మీ నాయకులు,మీ కార్యకర్తలు మీ దాంట్లో సర్పంచులుగా గెలిచిన వాళ్లే ఎంతోమంది మాకు వద్దురా ఈ పరిపాలన మేమెందుకురా ఓటేసినాము అని చెప్పి చెప్పుతో కొట్టుకున్న వీడియోలు చాలానే ఉన్నాయి. బహిర్గతంగానే కొట్టుకున్న వాళ్ళు ఉండారు. కొందరు మాకు వద్దు అని రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే బాగుండదని చెప్తున్నామని అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ అన్నారు.