క్యాన్సర్ బాధితునికి ఆర్ధికసాయమందించిన సిద్ధవటం జనసేన

సిద్ధవటం గ్రామపంచాయతీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్న సిద్ధవటం జనసేన నాయకులు కొట్టే రాజేష్, బీగాల సుబ్రహ్మణ్యం, ఆవుల రాజ, పసుపులేటి కళ్యాణ్ మరియు జనసేన మద్దతుదారులు రాజేష్, వేణుగోపాల్, అతికారి కృష్ణ, వంశీ, సుదర్శన్, అతికారి అయ్యవారయ్య, అవ్వారు వెంకటసుబ్బయ్య, సుంకర శ్రీహరి అందరూ కలిసి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. భవిష్యత్తులో జనసేన పార్టీ నాయకుల తరఫున ఇంకా సహాయం చేస్తామని భరోసా ఇచ్చి, ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీల వారు అందరూ ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు.