ప్రమాదంలో సింగరాయకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్..

  • యుద్దప్రాతిపదికన తగు చర్యలు చేపట్టి ప్రయాణికులను కాపాడవలెను.. జనసేన డిమాండ్

కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండు మునిగిపోయే ప్రమాదంలో ఉందని, ప్రయాణికుల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ భయాందోళనలు చెందుతున్నారు. సోమవారం సింగరాయకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన జనసేన నాయకులు మాట్లాడుతూ.. సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ కొద్దిపాటి వర్షానికే మునిగిపోవడం, ఎక్కువ నీరు నిల్వ ఉండిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం కాలవలు సైతం ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమణకు గురైనవి. దీని వలన వర్షం నీళ్లు బయటకు వెళ్లే వసతి లేక, కాలువలు పూడిక తీయుటకు నోచుకోక, నీళ్లు బయటకు వెళ్లే అవకాశం లేదని ప్రయాణికులు మరియు గతంలో జనసేన పార్టీ నుండి ఆర్టీసీ సంబంధిత అధికారులకు మరియు సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర గారికి తెలియపరచినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంపై వైసీపీ ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని.. పరిస్ఠితినీ చూస్తేనే తేట తెల్లం అవుతున్నది. వైసీపీ ప్రభుత్వం లోని నాయకులు ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజలను ప్రమాదంలో నెట్టే విధంగా నాయకులు వ్యవహరిస్తారన్నని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ పలుసార్లు ఆర్టీసీ సంబంధిత అధికారులకు సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ చంద్రకి తెలియపరచన్నపటికి అక్రమణకు, కబ్జాలకు గురైన వాటిపై చర్యలు చేపట్టని కారణంగా నేడు మాండూస్ తుఫాను ప్రభావం ఆర్టీసీ బస్టాండ్ మునకలో ఉంది. దీనిపై ప్రయాణీకులు ప్రభుత్వంపై తీవ్ర అగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెంటనే స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటినీ బయటకి పంపి ప్రయాణికులను కాపాడవలెను అని ప్రజల మనోధైర్యానికి అండగా జిల్లా కలెక్టర్ ఉండవలెను అని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయటం జరిగినది.