నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు: ఎమ్ హనుమాన్

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు, న్యాయవాది ఎమ్ హనుమాన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..

*వైసీపీ ప్రకటించిన నవరత్నాలలో మొదటి రత్నమైన రైతు భరోసా 64 లక్షల మందికి మెయిల్ అని చెప్పి కేవలం 50 లక్షల మందికే భరోసాడం నిజం కాదా?.. వైయస్సార్సీపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఉన్న పార్టీ, రైతు కష్టాలు పెంచే పార్టీగా మారింది కేవలం రైతు అనే మాట మాత్రమే పార్టీలో ఉంది కానీ రైతులకి ఏమాత్రం మేలు చేయలేదు. మూడేళ్లలో 3,000 మంది కవులు రైతులు ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి సహాయం చేస్తుంటే దాన్ని కూడా మీరు విమర్శ చేశారా లేదా సీఎం జగన్ గారూ. కౌలు రైతులకు పాస్బుక్ లేదు వాళ్ళు కౌలు రైతులు కాదు అని చెప్పారు.. కానీ కౌలు రైతులు పట్టాదారులు కాదని మరోసారి జగన్ మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం కౌలు రైతు అంటే ఒకరి పొలం లీజుకు తీసుకొని వ్యవసాయం చేయడం అని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నామన్నారు

*రెండవ రత్నమైన అమ్మఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు దీనికి సమాధానం చెప్పండి..?

*మూడవ రత్నమైన పెన్షన్ జాబితాలో ఐదు లక్షల మందిని తొలగించడం వాస్తవం కాదా దీనికి సమాధానం చెప్పండి..?

*నాలుగో రత్నమైన సంపూర్ణ మద్యపాన నిషేధం, 2018, 2019లో మద్యం అమ్మకాలపై ఆదాయం 14 వేల కోట్లు అయితే మీ ప్రభుత్వ హయాంలో 22 వేల కోట్లు ఆదాయం వచ్చింది వాస్తవం కాదా..?, ఇదేనా మీరు చేసే మద్యపాన్ని నిషేధం చెప్పండి. మద్యం దుకాణాలు తగ్గించి దశలవారీగా దుకాణాలు తొలగిస్తానని చెప్పి ఈ రోజున రేట్లు పెంచుకుంటూ పోయి మహిళకు కేవలం కన్నీళ్ళని మిగిల్చారు. మద్యపాన నిషేధం అమలుచేయకపొవడంతో మద్యానికి బనిసలైన వారు తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే అధిక మద్యం రేట్లతో బాధపడుతూ.. ఇంటి పరిస్థితిని చూసుకోకుండా తమ ఆదాయాం మొత్తం మద్యం దుకాణానికి చెల్లిస్తూ ఉండడంతో మహిళలకు కన్నీరే మిగిల్చాయి

*ఐదోరత్నమైన జలయజ్ఞం పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా అని మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం

*ఆరవ రత్నమైన ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్ ఎందుకు పక్క తప్పుకుంటున్నాయి.. దీనికి సమాధానం చెప్పండి..? సి ఎం ఆర్ ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు.. దీనికి సమాధానం చెప్పాలి..? ప్రజల తరఫున మేం ప్రశ్నిస్తున్నాం

*ఏడోరత్నమైన ఫీజు రియంబర్స్మెంట్.. ఫీజు చెల్లించుకోలేకపోవడం వల్లే కదా విద్యార్థులు హాల్ టికెట్స్ ఆపిన మాట నిజమా కాదా,
పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?..సమాధానం చెప్పాలి..?

*ఎనిమిదో రత్నమైన ఇళ్ళ నిర్మాణంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పి వచ్చిన ఏడాదికే 25 లక్షలు ఇళ్ళు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం చెరువులు, కొండలు, స్మశానం ప్రదేసాలలో స్థలాలు ఇచ్చిన మాట నిజమా కాదా..?, అది కూడా కేవలం 10 శాతం వరకే స్థలానికి కేటాయించి వారికి ఇంటి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయలేదు, చేయకపోగా ప్రజల దగ్గర్నుంచి 35 వేల రూపాయలు వసూలు చేస్తున్న మాట నిజం కాదా?

*తొమ్మిదో రత్నమైన ఆసరా పొదుపు సంఘాలు సంఖ్యను ప్రతి ఏడాది ఎందుకు తగ్గిస్తున్నారు. అభయ హస్తం నిధులు 2000 కోట్లు ఎటుపోయాయి దీనికి సమాధానం చెప్పాలి..?

ప్రజల్ని పథకాల పేరుతో మోసం చేసి అవినీతి చేసి నేడు అధికారంలో ఉన్న మీకు 2024లో ప్రజలు మీకు సరైన రీతులో సమాధానం చెబుతారు. అవినీతి, అక్రమంపై యుద్ధం చేయాలంటే ఆయుధం లేకుండా యుద్ధం సాధ్యం కాదు. మన ఆయుధమే మన ఓటు ఇప్పటివరకు చాలామందికి అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి జనసేనను నమ్మి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని, అవినీతి లేని పరిపాలన అందజేస్తామని జనసేన తరఫున ఎం హనుమాన్ తెలిపారు.