సిద్ధ వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన శివశంకర్

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు గ్రామంలో కొంత కాలంగా అతి చిన్న వయసులోనే క్యాన్సర్ కారణంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సిద్ధ వీరబాబు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ ఆదేశానుసారం వారి అన్నయ్య శివశంకర్ సిద్ధ వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి.. ఆ కుటుంబానికి మనోధైర్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్రి బాబ్జి, సిద్ధ వీరబాబు బెజవాడ రమణ, కర్రీ తాతిలు సిద్ధ మని, పల్నాటి మధు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.