మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి: జనసేన డిమాండ్

  • సీఎం పర్యటనతో మదనపల్లిలో రోడ్డుకి ఇరువైపులా వెలసిన బ్యానర్లు మరియు రోడ్డుకు మధ్యలో వేసిన భారికేడ్లు
  • సీఎం రాకతో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
  • భారి కేట్లకి ఒకవైపు ట్రాఫిక్ జామైన పరిస్థితి

మదనపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మదనపల్లి కి విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ పర్యటనలో మదనపల్లి ని జిల్లాగా ప్రకటించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేస్తూ జగన్మోహనరెడ్డి ఇంకా తాను ప్రతిపక్ష నాయకుడిననే భావనలో వుండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేటు చేస్తోందని అనిత తీవ్రంగా విమర్శించారు. తాను ముఖ్యమంత్రిననే స్పృహలోకి ఇప్పటికైనా ఆయన రావాలన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకునిగా వున్నప్పుడు ఎన్నికల ప్రచార నిమిత్తం మదనపల్లి కు విచ్చేసి వేలాది మంది సమక్షంలో ఇచ్చిన హామీలను చేశారు. మదనపల్లెలో టొమాటో ప్రాసిసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం, 3000 కోట్ల రూపాయలతో రైతులకు స్థిర నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం, ఇస్లామిక్ బాంక్ ద్వారా ముస్లిములకు రుణాలు అంశాలను గుర్తు చేశారు. అదేవిధంగా చాలాకాలంగా మదనపల్లికి సంబంధించిన డిమాండ్లలో భాగంగా మదనపల్లె నీటికొరత దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలతో ఏర్పాటుచేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అసంపూర్తిగా ఉండడాన్ని పూర్తి చేయాలని, మదనపల్లెలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన అయితే జరిగింది కానీ ఏమాత్రం పనులు ప్రారంభం కాని నేపథ్యంలో త్వరగా పనులు ప్రారంభించాలని, కేవలం బీఎస్పీ ఇతర రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల పోరాటంతోనే బీటీ కళాశాల ప్రభుత్వపరమైనది గుర్తుచేస్తూ బీటీ కాలేజ్ ని యూనివర్సిటీ గా చేయాలని, బ్రిటిష్ కాలంలోనే మదనపల్లి కున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి బ్రిటిష్ వారు ఏర్పాటుచేసిన రోడ్లనే ఇప్పటివరకు మదనపల్లి ప్రజానీకం వాడుకోవడాన్ని ఆయన గుర్తు చేస్తూ మదనపల్లిలో మంచి రోడ్లు వేయాలని,రాయచోటి, కుప్పం లాంటి పట్టణాల్లో రోడ్డు సిగ్నల్, ఫ్లై ఓవర్ లు, ఔటర్ రింగ్ రోడ్డులో ఉంటే మదనపల్లికి ఏ ఒక్కటి లేకపోవడాన్ని ఆయన్ని విమర్శిస్తూ ఈ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని, భారతదేశంలో ఐసిఎస్ఈ సిలబస్ స్కూల్లు ఊటీ, డెహ్రాడూ మరియు మదనపల్లి లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి మదనపల్లి ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని, ఇక్కడున్నటువంటి వాతావరణం మరియు వనరులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి ను టూరిజం హబ్ గా తయారు చేయాలని, రెండు లక్షల పై చిలుకు జనాభా ఉన్న మదనపల్లికి ఒక్క జాతీయ పరిశ్రమ గాని, ప్రాజెక్ట్ గానీ రాష్ట్రం నుండి ఒక ప్రాజెక్టు కానీ నిధులు గానీ రాకపోవడాన్ని ఆమె ఖండించారు. మదనపల్లి పక్క నియోజకవర్గాలైనటువంటి తంబళ్లపల్లి మరియు పుంగునూరులో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మదనపల్లికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లి కి ప్రత్యేక నిధులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రధాన అంశమైనటువంటి జగనన్న దీవెన అంశాన్ని అనిత ప్రస్తావిస్తూ గతంలో 11,80,000 నుండి 12 లక్షల వరకు ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ లు నేడు 750000 నుండి 8 లక్షల వరకు కుదించారు. అంటే సుమారుగా 350000 మంది పిల్లలకు స్కాలర్షిప్లు తీసివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంచి ఇల్లు కట్టుకుంటే, 300 యూనిట్ల కరెంటు బిల్లు వస్తే, కారు పెట్టుకుంటే అన్ని పథకాలు రద్దు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. అంటే ప్రజలు ఎలాంటి సుఖ సంతోషాలకు పోకుండా కేవలం వారి పథకాలకు మాత్రమే అలవాటు అయ్యేలాగా తయారు చేశారని తీవ్రంగా విమర్శించారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మేం చెప్పిన డిమాండ్లన్నీ నెరవేరాలంటే ఉన్న ఒకే ఒక మార్గం మదనపల్లి జిల్లాగా ప్రకటించాలి, కావున ముఖ్యమంత్రి గారి నేటి పర్యటనలో మదనపల్లి ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్, శంకర్, వేణుగోపాల్, వెంకటేష్, దారం హరి తదితరులు పాల్గొన్నారు.