జనసేన ఆయుధంగా సోషల్ మీడియా

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ డిజిటల్ క్యాంపెయిన్, ఏపీలో రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సోషల్ మీడియా వేదికగానే సాగింది.

సోషల్ మీడియా అనేది… దయచేసి మీ అందర్నీ రిక్వెస్ట్ చేసేది… అది మనం ఒక ఆయుధంగా వాడుకుందాం… ఒకరిపై ఒకరు ఆరోపణల కోసం… లేదా ఆ మూర్ఖులు చేస్తున్న కార్యక్రమాల గురించి మనం కామెంట్లు చేయడమో మనకు అవసరం లేదు..వాళ్ళు మూర్ఖులని ప్రజలు తేల్చేశారు..నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు ప్రజలు”…సోషల్ మీడియా గురించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు.

సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తే ఏమిస్తాది అని జనసేనకు ప్రశ్నలు టీడీపీ, వైసీపీ నుండి రావొచ్చు కానీ వచ్చిన ట్వీట్స్ గురించి జనసేన కు సమాధానం చెప్పలేక అధికార మరియు ప్రతిపక్ష నేతలు ఎకౌంట్స్ బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయంటే జనసేన విజయం సాధిన్చినట్టే.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ కి పవన్ కళ్యాణ్ పిలుపు నివ్వడం, ట్వీట్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ రావటం జరిగింది. ఈ డిజిటల్ కంపెయిన్ సెగ టీడీపీ, వైసీపీ ఎంపిలకే కాదు బీజేపీ ఎంపిలకు కూడా తగిలింది. టిడిపి నుండి బీజేపీలలో జంప్ అయిన ఎంపిలని కూడా ట్యాగ్ చేయటంతో సెగ బీజేపీకి కూడా తగిలింది. కొన్ని రోజుల క్రితం రోడ్ల పరిస్థితి పై డిజిటల్ కాంపెయిన్ చేసిన జనసేన, కొంతవరకు విజయం సాధించింది. కొంతవరకు రోడ్లు మరమ్మత్తు చేయటానికి వైసీపీ దిగిరాక తప్పలేదు. సమస్యలపై కాకుండా ఒకప్పుడు సోషల్ మీడియా ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూడలేక అసూయతో పబ్లిక్ వేదికలపై ఎంతో మంది విమర్శలు చేసినవారే ఎక్కువ. కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటివారు పవన్ కళ్యాణ్ నీ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసి సెలబ్రిటీ హోదా పొందారంటే అతిశయోక్తి కాదు.

గతంలో ఇప్పటికన్నా ఎక్కువగా రోజుల తరబడి మీడియా సహాయంతో కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటివారు పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి ఈర్ష్యతో పబ్లిక్ వేదికలపై నోటికొచ్చినట్లు నిరాధారంగా వ్యక్తిగత కువిమర్శలు చేసేవాళ్ళు..దాదాపు ఈ మెగా ఫ్యామిలీని పనిగట్టుకుని మరీ విమర్శించే వారంతా సమాజంలో గౌరవం పొందని వారు, కష్టపడి పైకి రాలేనివారు, దేంట్లోనూ స్థిరపడనివారు, నిత్య అసంతృప్తులే ఎక్కువ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడాన్ని సహించలేని వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక వ్యక్తిగత విషయాలు, బూతులతో సమస్యను పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగతంగా, బుతులతో మాట్లాడి మూర్ఖంగా రెచ్చకొడతారు

జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తూ విజయ సాధిస్తుంది కాకపోతే సోషల్ మీడియాని ఉపయోగించే విషయంలో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలని పార్టీ పెద్దలు సూచన విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం ఉంది..పార్టీలో బాధ్యతగల టీమ్ ఉంది.. కలిసి చర్చించుకుంటారు..రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది… వాడు మాట్లాడాడని మనమూ అంతేనా..పవన్ కళ్యాణ్ ఆచి తూచి ఎంత హుందాగా విమర్శలు చేస్తారు, చురకలు అంటిస్తారు..మనం ఆ పార్టీని నమ్మినపుడు పార్టీ భావజాలం కొంతైనా మనలో కనపడాలి కదా! ఆయాన్ని చూసి మనం ఇదేనా నేర్చుకున్నది? మన పోస్టులు పదిమందిని ఆకర్షించేట్టు ఉండాలి.

చాలా మందికి సొంత ఐడీ ఉండదు.. పేరు, ఊరు కూడా ఉండదు, సొంత పిక్ ఉండదు.. ఆడో మగో తెలీదు.. బయో డిటైల్స్ ఉండవు.. అంతా గోప్యం.. అదేమంటే ప్రైవసీ ప్రాబ్లం, మార్ఫింగ్ చేస్తారనో మరెదో కారణం చెబుతారు.. మనం పవన్ కళ్యాణ్ అభిమానులం..ఆయన ధర్మబద్ధంగా రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడతారు, ప్రతి నిర్ణయం ఎంతో ఆచితూచి మాట్లాడతారు..అవినీతి ఆరోపణలు లేని మచ్చ లేని నాయకుడు.. మరి, ఆయన్ని సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్లాలి.

జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు మాత్రమే కాదు జనసైనికులు కూడా… సోషల్ మీడియా వేదికగా జనసైనికులు ఏ విమర్శ చేసిన అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. సోషల్ మీడియా అనేది జనసైనికులు సమస్యని విజయవంతంగా సాధించుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని పార్టీ పెద్దలు కోరేది.