హనుమకొండ జనసేన కార్యాలయంలో వైభావంగా క్రిస్మస్ వేడుకలు

హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కమిటీ సభ్యులు, యువజన విభాగం సభ్యులు, విద్యార్థి విభాగం సభ్యులు, మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.