అంబేద్కర్‌కు ముట్లూరు జనసైనికుల ఘన నివాళి

ప్రత్తిపాడు: ముట్లూరు గ్రామంలోని జనసేన పార్టీ ఆఫీసులో ముట్లూరు జన సైనికుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వట్టి చెరుకూరు మండల అధ్యక్షుడు ప్రత్తి బావన్నారాయణ, ముట్లూరుగ్రామ అధ్యక్షుడు కోటికం వెంకటేశ్వరరావు, బీరాల శ్రీనివాసరావు, బుర్రి నాగేశ్వరరావు, ప్రసాదు, లక్ష్మయ్య, బాలాజీ, రామయ్య, వెంకటేశ్వర్లు, పాలెం వాసు మరియు గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.