గాదె వెంకటేశ్వరరావుని కలిసి అభినందనలు తెలిపిన ఇప్పటం జనసైనికులు

గుంటూరు, అధికార పార్టీ వారు ఇప్పటం గ్రామంలో అన్యాయంగా జరిపిన కక్ష సాధింపుల్లో భాగంగా రోడ్డు విస్తరణ అనే నేపంతో గ్రామంలో ఇళ్లను కూల్చివేయడం అలాగే కొందరిపై అక్రమ కేసులు బనాయించటం విషయాలు మనకు తెలిసినవే. ఈ సందర్భంగా ఇప్పటం జనసైనికులు మాట్లాడుతూ గత నెల 31వ తారీకున పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పడం గ్రామంలో పర్యటనలో కరెంటు తీయించారు. తర్వాత జనసేన ఫ్లెక్స్ లను చించి వేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుల సలహాతో మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరుసటిరోజు ఉదయం అధికార పార్టీ నాయకులు మా ఇళ్లను రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేయాలి అని చూస్తున్నారు అని తెలిసిన వెంటనే వాటికి సంబంధించిన పేపర్లను రెడీ చేయించి మా చేత హైకోర్టు న్యాయవాది చిదంబరం దగ్గరకు పంపించారు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రోక్లైన్లు రావడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే గాదె వెంకటేశ్వరరావుకి తెలియజేయడం జరిగింది. తర్వాత మమ్మల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారని తెలుసుకొని వెంటనే దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ సిఐతో మాట్లాడి మమ్మల్ని ఇప్పటం గ్రామానికి తీసుకొచ్చి మా కుటుంబాల అందరినీ కలిసి అందరికీ మనోధైర్యం ఇచ్చినందుకు మరియు మేము ఎప్పుడు ఫోన్ చేసి వెంటనే స్పందించి మాకు ధైర్యాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా గ్రామానికి వచ్చి మాకు వెన్నుదండగా నిలిచిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మా నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ మరియు మాకు, మన పార్టీ కి అండగా ఉన్న రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు, నగర అధ్యక్షులకు మరీ ముఖ్యంగా వీర మహిళలకు, జనసైనికులకు అందరికీ పేరు పేరునా మా ఇప్పటం గ్రామం తరుపున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.