మెగాస్టార్‌ ఫై సోనూసూద్ ప్రశంసలు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల తాను నటించే ఆగిపోయిన సినిమాలన్నింటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. మళ్లీ షూటింగ్ లు మొదలు కావడం తో సెట్స్ పైన సోను బిజీ అయ్యాడు.

ప్రస్తుతం ఈయన మెగా స్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ గురించి కూడా కొన్ని విషయాలు వెల్లడించడమే కాకుండా.. చిరంజీవి ఫై ప్రసంశలు కురిపించారు.. చిరంజీవితో ఎన్నిసార్లు నటించినా ప్రతిసారి ఓ కొత్త అనుభూతి కలుగుతుందని అన్నాడు. ఆయన చాలా పరిణితి చెందిన నటుడిగా కొనియాడాడు.. చిరుతో ఎన్ని సార్లు చేసిన ప్రతిసారి కొత్త అనూభూతిని కలిగిస్తోందని, అతడు గొప్ప స్టార్ అని ఆకాశానికి ఎత్తేశాడు. అంతే ఆచార్య సినిమా సంగతులన్ని పంచుకున్న సోనూ ఇందులో తన లుక్ కొత్తగా ఉంటుందని సినిమా గురించి లీక్ చేశాడు.