ఎస్‌బీఐలో భారీ వేతనంతో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 149 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

మొత్తం పోస్టులు: 149

ఇందులో డాటా అనలిస్ట్ 8, ఫార్మసిస్ట్ 67, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ 1, అడ్వైజర్ 4, డిప్యూటీ మేనేజర్ 10, మేనేజర్ 51, ఎగ్జిక్యూటివ్ 1, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 3 చొప్పున ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

పరీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు ప్రారంభం తేదీ:  ఏప్రిల్ 13

దరఖాస్తులకు చివరితేదీ: మే 3