చిర్రావూరులో జనసేన వీరమహిళల ఆత్మీయ సమావేశం

మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు సూచనతో చిరావూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన వీరమహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా మహిళా శక్తి ఎలా ఉండాలి అనే దాని గురించి అలానే చిరావూరు గ్రామంలో దాదాపుగా 250 పైచిలుకు మహిళలు జనసేన పార్టీ కండువా కప్పుకుని స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ వీర మహిళలు గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి గారు, రాష్ట్ర నాయకురాలు పాకనాటి రమాదేవి, తాడేపల్లి మండల కార్యదర్శులు చాముండేశ్వరి దేవి, జి బాలమ్మ తదితరులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, తాడేపల్లి మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు చిర్రావూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అంకం కాళీ కృష్ణ, ఉపాధ్యక్షులు పోకల శివయ్య, అడపా విజయ్, గ్రామ కార్యదర్శులు పోగల రామారావు, మేడూరి ప్రసాద్, పోకల సుధీర్, పోకల శివ నాగేశ్వరరావు, బుల్లెట్ నాగేశ్వరావు, బొప్పన రాము మరియు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు.