జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్న శ్రీరామ రామాంజనేయులు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమావేశం మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో ముఖ్యంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కా కావడం మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయి నుండి జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యాచరణ వివరించడం జరిగిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ చేసిన ప్రసంగం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయన్నారు. సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ ను కలిసి మదనపల్లిలో టిడిపి జనసేన ఉమ్మడిగా చేపట్టిన ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం అలాగే మెడికల్ క్యాంప్స్, క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వస్తున్న స్పందన విషయాలు మీద వివరించడమైనది.