జనసేనలో చేరిన శ్రీ వెన్నా జగదీష్

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు దివంగత వెన్నా నాగేశ్వరరావు గారి పేరు చిరపరిచితం. మూడు దఫాలు ఎమ్మెల్యేగా సేవలందించారు వెన్నా నాగేశ్వరరావు గారు. ఆయన కుమారుడు శ్రీ వెన్నా జగదీష్ మంగళవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేనలో చేరారు. శ్రీ వెన్నా జగదీష్, ఆయన భార్య శ్రీమతి సుజాత, అల్లుడు శ్రీ యర్రంశెట్టి సత్యనారాయణ, మనుమడు శ్రీ యర్రంశెట్టి విజయ్ కుమార్, వారి అనుచరులకు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పంతం నానాజీ, శ్రీమతి మాకినీడు శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.