రాష్ట్ర చిరంజీవి యువత సమావేశం

తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యవర్గం అధ్యక్షుడు ఆటో ప్రసాద్, ఉపాధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఆగస్ట్ 16 వ తేదీ నుంచి ఆగస్ట్ 22 వ తేదీ వరకు వారం రోజుల పాటు సేవాకార్యక్రమాలు నిర్వహణ కోసం కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చర్చించడం జరిగింది. మొక్కల పంపిణీ, మొక్కలు నాటడం, అన్నదానం మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు సాధక్ వలి, అల్తాఫ్, గోపాల్, శివకుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్, అఖిల్,సాయి, అమీర్, రబ్బానీ, గైబుసాబ్, షెక్షా వలి మొదలైన వారు పాల్గొన్నారు.