జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం

  • తిమింగలాలు వంటి పది మంది ప్రతినిధులతో ఎదురొడ్డి నిలబడిన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ మాకు ఆదర్శం అంటూ జనసైనికులు.
  • ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అండగా నిలబడతాం, భయపడాల్సిన అవసరం లేదు స్వయంగా నేనే వచ్చి వారి సమస్యలు పరిష్కారానికై పోరాడుతా… నా వెనకాల పవన్ కళ్యాణ్ అనే శక్తి ఉంది అంటూ మద్దతుగా నిలబడ్డ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మణిక్రాంతి భరోసా.

కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గపు నాయకుడు చప్పిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి మండల కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులతో ముఖాముఖి చర్చించారు. రానున్న రోజుల్లో మండల కమిటీ సభ్యులందరూ ప్రతీ పల్లెకి జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా పలు మండలాల్లోని సమస్యలను వారు జనసేన పార్టీ తరఫున ప్రజలకు ప్రజల సమస్యలపై నిలబడాల్సిన విధివిధానాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ నాయకులతో పాటు జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, దుగ్గిశెట్టి సుజయ్ బాబు, సుధీర్ బి, సుధీర్ కె, శివ కృష్ణ, మున్వర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.