రోడ్ల సమస్యల పరిష్కారానికి అడుగులు వేయాలి: లక్ష్మణ కుటాల

కదిరి, ఎమ్మెల్యేగారూ… సింహకోట ప్రాంతంలో శ్రీమద్ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర గోపురం ఎదురుగా మలుపులో రోడ్డు మొత్తం గుంతలుగా ఏర్పడి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరియు నిత్యం 100 సంఖ్యలో ఈ రహదారి గుండా కదిరి నుంచి హిందూపురం మరియు కర్ణాటక వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల రాకపోకలకు చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది మిమ్మల్ని నమ్మి కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టకుండా మొద్దు నిద్రపోతున్నారు. మీకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తుకు రావా…? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తారా. శ్రీమతి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేసిన రోడ్డు కేవలం 5 నెలల్లో గుంతలమయమైంది. ఒక హిందూపురం క్రాస్ అయితేనేమి ఆ సింహ కోట దగ్గర అయితేనేమి టీటీడీ కళ్యాణ మండపం దగ్గర అయితేనేమి ఇలా రోడ్డు మొత్తం గుంతల మయమైంది. ఇప్పటికైనా మీరు ప్రజాప్రతినిధిగా ప్రజలు పడుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం వైపుగా అడుగులు వేస్తారని కదిరి జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల తెలిపారు.