సమగ్రశిక్షా ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

  • పండుగలు కూడా సంతోషంగా జరుపుకొకుండ ప్రజలను రోడ్లమీదకు తెచ్చి చరిత్ర హీనిడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి
  • సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాం
  • జనసేన టీడీపీ పార్టీలతోనే అన్ని వర్గాల ప్రజలను సమానమైన న్యాయం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: ఏ.పీ సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గత 13రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెకు సోమవారం నాడు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపి సమ్మెలో పాల్గొన్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పిఆర్సి అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయలేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మినిమం ఆఫ్ టైం స్కేల్ పై జీవో మీద జీవోలు ఇచ్చినప్పటికీ అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన సమాన పనికి సమాన వేతనం ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయడం ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేయడం 10లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కల్పించి వారికి తప్పకుండా సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ఫీల్డ్ లెవల్లో తిరిగే సమగ్ర శిక్ష ఉద్యోగులకు Fటా అమలు చేసి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని వీటితోపాటు మొదలగు అన్ని డిమాండ్లను త్వరితగతిన అమలు చేయాలని లేని యెడల వీరి సమస్యను తప్పకుండా జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరి సమస్యలు తప్పకుండా పరిస్కరిస్తామన్నారు ఆదేవిదంగా రాష్ట్రంలో ఏ శాఖకు ఏ మంత్రో కూడా ప్రజలకు తెలియదని తెలుసుకోవాలంటే గూగుల్ లో సర్చ్ చేసే పరిస్తితి వచ్చిందని అన్ని శాఖలు జగన్ సజ్జల రామకృష్ణ రెడ్డిల చేతిలోనే పెట్టుకొని రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారన్నారు ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.