పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గం ఇంచార్జ్ మాయ రమేష్ పిలుపు మేరకు మహాదేవపూర్ మండలంలో జనసేన పార్టీ నాయకులు కాల్వ రాజశేఖర్ ఆధ్వర్యంలో మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో మహాదేవపూర్ మండల జనసైనికులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో జనసైనికులు అందరూ ఫిర్యాదు చేయాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లీగల్ సెల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా శనివారం పవన్ కళ్యాణ్ కుటుంబంలోనీ స్త్రీలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా మాట్లాడీన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేష, జ్వాల, రాజేష్, నారా రవికాంత్, కలుగురి విజయ్, కారింగుల మధుకర్ పాల్గొనడం జరిగింది.