విద్యార్థుల మహార్యాలి… అమలాపురం వద్దు, రాజమహేంద్రవరం ముద్దు

*ప్రజల సౌకర్యాలను పరిగణంలోకి తీసుకోండి
*జనసేన యువ కెరటం వేగుళ్ళ రాజబాబు

మండపేట ప్రజలు కోరుకునే రీతిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలోనే మండపేటను విలీనం చేయాలని జనసేన యువ కెరటం వేగుళ్ళ రాజబాబు డిమాండ్ చేశారు. జె.ఏ.సి ఆధ్వర్యంలో మండపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జె.ఏ.సి దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన మహార్యాలిలో ఆయన పాల్గొని, ఎం.ర్.ఓ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాలు ఏకమై జె.ఏ.సి గా ఏర్పడి వినతులు ద్వారా కార్యక్రమలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మండపేట కలిస్తే కలిగే ప్రయోజనాలు వివరించారు. మండపేట ప్రజల సౌకర్యాలను పరిగణంలోకి తీసుకోని ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. జె.ఏ.సి కి జనసేనపార్టీ తరుపున ఎల్లప్పుడూ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాలు, విద్యార్థులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.