కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత

  • కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.. పరామర్శించడానికి వెళ్ళిన జనసేన నాయకులను అడ్డుకున్న పోలీసులు..!

ఆనంతపురము అర్బన్: అనంతపురం జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు టి సి వరుణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం సింగనమల మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో పాయిజన్ ఫుడ్ తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సింగనమల మండల కేంద్రానికి విద్యార్థులను పరామర్శించడానికి వెళ్ళిన జనసేన నాయకులు పోలీసులు వెళ్లడానికి వీలులేదని అడ్డగించారు. ఈ క్రమంలో జనసేన నాయకులు తీవ్ర ప్రతిఘటన చేసి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళాక కూడా హాస్టల్లోకి వారిని అనుమతించకుండా హాస్పిటల్ లోకి మాత్రమే అనుమతించి, అక్కడ పేషెంట్లు అందరూ డిశ్చార్జ్ అయ్యారని, హాస్టల్లోకి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా బాధితులకు న్యాయం చేసేంతవరకు జనసేన ఆధ్వర్యంలో అండగా ఉంటామని, ఎంతవరకైనా పోరాడుతామని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబు రావు, జిల్లా సంయుక్త కార్యదర్శులు బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మ, సింగనమల మండల కన్వీనర్ తోట ఓబులేసు, మేదర వెంకటేష్, బిందెల సాయి, శంకర్, దరాజ్ భాష, హరీష్ రాయల్, తోట మోహన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.