బస్సు సౌకర్యం కోసం విద్యార్థుల ధర్నా

  • బస్సును అడ్డుకుని నిలిపివేసిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు
  • ప్రతిరోజు సాయంత్రం 4:15 నుండి 4:30 లోపు బస్సు రావాలని ధర్నా చేశారు
  • అర్జీలు ఇచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పట్టించుకోకుండా ఉన్న అధికారులు

ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, ముండ్లమూరివారిపాలెం గ్రామంలో ఉన్నటువంటి హైస్కూల్ కి చుట్టుపక్కల 5 గ్రామాల నుండి విద్యార్థులు రావడం జరుగుతుంది. బయట గ్రామాల నుండి 80 మంది విద్యార్థులు ప్రతిరోజు ఇక్కడ హైస్కూల్ కి రావడం జరుగుతుంది. వారికి సైకిళ్ళు లేవు, బస్సు సౌకర్యం సమయానికి రావడం లేదు. గత ఏడాది విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సరైన సమయానికి బస్సు సౌకర్యం ఉండేది. ఈ సంవత్సరం మాత్రం బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ కి వస్తూ ఉంటే మార్గం మధ్యలో కొంతమంది ఆకతాయిలు తాగి వారిని అల్లరి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బస్ డిపో మేనేజర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా స్పందనలో కూడా పెట్టడం జరిగింది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేలుకొని స్పందించి, కందుకూరు నుండి చెరుకురు గ్రామానికి వచ్చే బస్సు సాయంత్రం ముండ్లమూరివారిపాలెం గ్రామానికి వచ్చేసరికి 4:15 నుండి 4:30 వచ్చే విధంగా అధికారులు చూడాలి అని కోరుకుంటున్నారు.