విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలి: యడ్లపల్లి

కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శారీరక దారుఢ్యం మరియు ఆటలలో నైపుణ్యం పెంపొందించుటకు స్పోర్ట్స్ కిట్లను జనసేన కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి చంద్రమౌళి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఈ స్పోర్ట్స్ కిట్లు విద్యార్థినీ, విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ.. విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు ఆటలలోను ప్రతిభతో రాణించాలని, మాట్లం గ్రామం నుంచి ఎంతో మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ లో ఆడి గుర్తింపు పొందారని, ఇదే స్ఫూర్తితో చదువు మరియు ఆటలు రెండు రంగాలలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. మాట్లం గ్రామ క్రీడాకారుడు అంతర్జాతీయ వాలీ బాల్ ప్లేయర్ పరశురామ్ ను అభినందించారు. మాట్లం పాఠశాలలో తాగునీటి కోసం ట్యాంక్ నిర్మాణ దశలో ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాగునీటి అవసరాలకు వాటర్ క్యాన్ లు అందచేయాలని ఉపాధ్యాయులు రామ్ సుధీర్ గారిని కోరగా అందుకు రామ్ సుధీర్ తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తిరుమలశెట్టి చంద్రమౌళి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ చేతుల మీదుగా గరిశపూడి గ్రామస్తులకు అందచేశారు. మొక్కలు నాటే అలవాటును ప్రతీ ఒక్కరూ పాటించాలని పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉందని తెలియచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కు మొక్కలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి చంద్రమౌళి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓడుగు ప్రభాస్ రాజు, మాట్లం గ్రామ క్రీడాకారుడు అంతర్జాతీయ వాలీ బాల్ ప్లేయర్ పరశురామ్, స్కూల్ చైర్మన్ తాతారావు, మాట్లం డాన్స్ మాస్టర్ నాగరాజు, తిరుమాని నాగేశ్వర రావు, తిరుమాని రమణ మూర్తి, బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, జనసేన నాయకులు బాడిత నాగబాబు, కృత్తివెన్ను మండల కార్యదర్శులు కొప్పినీటి నరేష్, బుద్దన బాబీ, తెలగంశెట్టి ఏడుకొండలు, ఇంటి కిరణ్, కాజ బాలాజీ, బంటుమిల్లి ఉపాధ్యక్షులు గొట్రు రవి కిరణ్, కార్యదర్శి మారుబోయిన సుబ్బు, జనసేన నాయకులు కూనప రెడ్డి రంగయ్య, పుల్లేటి దుర్గా రావు, పోలగాని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందర రాజు, కొఠారి మల్లి బాబు, శివ గార్లు మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.