మదనపల్లె జిల్లా సాధన కోసం విరివిగా వినతిపత్రాలు‌ అందించండి

మదనపల్లె జిల్లా సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాలని మదనపల్లె జిల్లా సాధన జేఏసి నాయకులు సూచించారు. గురువారం మదనపల్లె జిల్లా సాధన జే.ఏ.సీ ఆద్వర్యంలో బిటి కళాశాల ఎదుట నిరసన వ్వక్తం చేశారు. ఈ‌ కార్యక్రమంలో‌ జిల్లా సాధన జే.ఏ.సి నాయకులు జనసేన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాస్ చౌదరి, బి.ఎస్.పి పార్టీ భిందెల గౌతమ్ కుమార్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, కాంగ్రెస్ నాగుర్ వలి, రెడ్డి బాషా, ఇంతీయాజ్, పునీత్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మదనపల్లె జిల్లా సాధన కోసం ఉద్యమం చేపట్టి సుమారు 600 రోజులు అయినా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లె జిల్లా కోరుతూ పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రాలు అందించారని, దీనిని మరింత ఉదృతం చేస్తూ మదనపల్లె జిల్లా కోసం ప్రతి ఒక్కరూ వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. అన్ని సౌకర్యాలు ఉన్న మదనపల్లెను‌ జిల్లాగా ప్రకటించే వరకు‌ పోరాటం ఆగదని స్పష్ట చేశారు. ‌ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన జే.ఏ.సి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.