Razole: 9వరోజు మరియు ఆఖరిరోజు సమర్ధవంతంగా క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ పూర్తి చేసిన రాజోలు వైస్ ఎంపిపి

తొమ్మిదవరోజు మరియు ఆఖరిరోజు చింతలపల్లి భాగంగా రుద్రా వారి మెరక జనసేన కార్యకర్తలకు భరోసాగా ఐదు లక్షల రూపాయల ప్రమాదభీమా రాజోలు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గత తొమ్మిది రోజులుగా రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు(వైస్ ఎంపిపి) ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యులుగా చేరిన జనసేన కార్యకర్తలకు రోజుకు ఒక గ్రామం చొప్పున ఇంటింటికి వెళ్లి కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు జనసేన పార్టీలో గెలిచిన MPTCలు, వార్డ్ నెంబర్లు, సర్పంచులు, జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిలు, వాళ్ళ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, ఐదు లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క ఏడు సిద్ధాంతంతో కూడిన వివరాలు, పవన్ కళ్యాణ్ ఫోటో, అధ్యక్షుల వారి మనోగతం పేపర్, కిట్లు తో జతపరిచి ఇవ్వటం జరిగింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మలికిపురం మండల పరిషత్ ఉపాధ్యక్షులు జనసేన పార్టీ శ్రీమతి మేడిచర్ల శ్రీవాణి(MPTC), అడబాల శ్రీనివాసరావు(కాట్రేనిపాడు MPTC), సుందర శ్రీను(గూడపల్లి MPTC), శ్రీమతి కుడుపూడి మల్లేశ్వరి(కూనవరం MPTC), శ్రీమతి పున్నం నాగదుర్గ(మెరకపాలెంMPTC), బైరా నాగరాజు(అంతర్వేది దేవస్థానం MPTC), శ్రీమతి దార్ల కుమారిలక్ష్మి(రాజోలు MPTC) మరియు జిల్లా సంయుక్త కార్యదర్శులు గుబ్బల రవికిరణ్, జనసేన నాయకులు బోనం సాయి, గడ్డం మహాలక్ష్మిప్రసాద్, అడ్డగళ్ళ బంగార్రాజు, సూదా మోహనరంగా, రుద్ర సూర్యనారాయణ, పిప్పళ శ్రీను, మార్లపూడి మధు, పిప్పళ లక్ష్మణరావు, కోళ్ల సత్తిబాబు, ఘనసాల బాలాజీ, ఘనసాల రామరాజు, పలివెల రమేష్, అద్దేపల్లి గోపి, లంకపల్లి రమేష్, కోళ్ల వేణు, కోళ్ల మల్లి, అలాగే ప్రతి గ్రామంలో జనసైనికులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.