డ్రైనేజీ నిర్మించిన తర్వాతే సిసి రోడ్డు నిర్మించాలి.. జనసేన డిమాండ్

డ్రైనేజీనీ మరిచి సీసీ రోడ్డుకు ఆమోదం ఇచ్చిన ఏ ఈ శ్రీహరి

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ స్థానిక రైల్వే రోడ్డు నందు గడపగడప కార్యక్రమంలో వచ్చిన నిధులనుండి ట్రంక్ రోడ్డుకు మరియు రైల్వే రోడ్డును కలుపుకొని చిన్నపాటి సీసీ రోడ్ నిర్మాణం చేయటానికి పంచాయతీ రాజ్ ఏ ఈ శ్రీహరి సుమారు మూడు లక్షల పదివేల రూపాయలకు ఎస్టిమేషన్ వేసినాము అనీ తెలియపరిచినారు. కానీ ఎస్టిమేషన్ లో సిసి రోడ్ నిర్మాణం గురించి ఇచ్చినప్పుడు క్రింద డ్రైనేజీ వ్యవస్థను మరిచినారు. దీనిపై జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇచ్చిన తీర్మానంలో ఏవిధంగా ఆమోదం పొంది ఉన్నారు, లేక మినిట్స్ బుక్ లో పోందపరిచిన వివరాలను ఇవ్వమని అడగగా, సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి గారు మేము సాధారణ సమావేశంలో 7-01- 2023న తీర్మానం చేసినాము. మిగిలిన విషయములు ఏఈ పంచాయతీరాజ్ శాఖ శ్రీహరి గారు ఎస్టిమేషన్ వేసినారు అని చెప్పడం జరిగింది. దీనిపై ఏఈ శ్రీహరి గారిని డ్రైనేజీ నిర్మాణం లేకుండా ఏవిధంగా ఎస్టిమేషన్ వేసినారు, అని జనసేన పార్టీ నుండి ఏఈ శ్రీహరి గారిని వివరణ అడగడం జరిగినది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తూములు కానీ, కాలువగానీ, ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టమని జనసేన పార్టీ వారు వివరించడం జరిగినది. ఏ ఈ శ్రీహరి గారు డ్రైనేజ్ నిర్మించిన తరువాతే సిసి రోడ్డు నిర్మాణం చేపడుతామని జనసేన పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగినది. ఏఈ శ్రీహరి కి జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగినది. సింగరాయకొండ మండలంలో ప్రజల సమస్యలపై జనసేన పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ నాయకులు కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, అనుమల శెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, సయ్యద్ సుభానీ, తగరం రాజు, పసుమర్తి నాగేశ్వరరావు, రెనుమాల రామకోటయ్య, పర్తిపి వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.