జగనన్న పాలనలో నేతన్నల ఆత్మహత్యలు

కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, పెడన పట్టణంలోని 17వ వార్డులో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు కాసిన పద్మనాభం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. పద్మనాభం నేత కార్మికుడే కాకుండా అరుదైన కళాకారుడు కూడా, ఇతను వేపాకు, కరివేపాకు, గులాబీ రేకులకు చిన్న రంధ్రం చేసి వాటినుండి కర్చీఫ్ లు, చీరలను తీసి అనేకమంది మన్ననలు పొందారు. ఇటీవలే తన కుమార్తె వివాహం కూడా చేశారు. కుమారుడు స్థానికంగా టైలర్ గా పనిచేస్తాడు. తాను నమ్మిన చేనేత వృత్తి తనకు సరైన ఉపాధి కల్పించలేదు. కష్టానికి సరిపడా ఫలితం లేక, అప్పుల బాధలు తట్టుకోలేక విధిలేని పరిస్థితిలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల కుటుంబాల బాధలు వర్ణనాతీతం. పని దొరకడం కష్టం. ఒకవేళ దొరికిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. కుటుంబ సభ్యులు అందరూ కష్టపడిన వచ్చే ఆదాయం జీవన వ్యయానికి సరిపోదు. అనేక వేల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినక నేతన్నకు కష్టాలు రెట్టింపయ్యాయి. నేతన్న నేస్తం అంటూ నేత కార్మికులను దగా చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను, గ్రాంట్ లను పక్కదారి పట్టించడం వల్ల, చేనేత పరిశ్రమ మొత్తం నిర్వీర్యమై పోతుంది. జోగి ఇలాకాలో చేనేత కార్మికులను ఓట్ బ్యాంకుగా వాడుకోవటమే గాని వాళ్ల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా చేనేత కార్మికులకి వస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మరియు వివిధ రకాల గ్రాంట్లు తన అనుకూల మనుషులకి, తన అనుచరులకు ఇప్పించుకోడమే కాకుండా వారిని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడంతో 95% గా ఉన్న సామాన్య చేనేత కార్మికులు నష్టపోవటం వలన ఈ సమస్య ఏర్పడింది. గతంలో చేనేత కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేయడం జరిగింది. అనేకసార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం వల్లనే ఈరోజు ఓ నిండు కుటుంబం ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చేనేత పరిశ్రమను ఆదుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేతన్నలకు బరువెక్కిన హృదయంతో విజ్ఞప్తి తొందరపడకండి, మీతో జనసేన పార్టీ ఉంటుంది. సమస్య ఏదైనా పోరాడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది అని జనసేన పార్టీ పెడన నియోజకవర్గం నాయకులు ఎస్ వి బాబు సమ్మెట తెలిపారు.