కందరడా గ్రామసమస్యలపై వినతిపత్రం అందించిన పిల్లా సునీత

పిఠాపురం, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం కందరడా గ్రామానికి విచ్చేసిన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కందరడా జనసేన ఎంపీటీసీ పిల్లా సునీత కందరడా గ్రామసమస్యలపై వినతిపత్రాన్ని ఇచ్చి, గ్రామభివృద్ధికి సహకరించాలని, ప్రజాసంక్షేమమే ప్రజాప్రతినిధులు లక్ష్యం అని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, కందరడా గ్రామానికి వచ్చిన ఎంపీటీసీ నిధులు, వాటి విడుదల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.

  • గ్రామాభివృద్ధికి రావలసిన నిధులు..4,8 వార్డుల్లో డ్రైన్ వ్యవస్థను మెరుగుపరచి చిన్న వర్షం పడిన నీరు పోయే దారిలేక నిల్వ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దానికి శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చూడమని
  • 9వ, వార్డులో సీతరమ చెరువులో 1983నుండి వివిధ ప్రభుత్వలో స్థలాలు ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారందరికీ శాశ్వతంగా వారికి భూమిహక్కు కలిగేవిధంగా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సహకరించాలని,
  • 9వ వార్డ్ బుడజంగం సోదరుల వీధిలో సిమెంట్ రోడ్ నిర్మాణం,
  • 12వ వార్డ్ సతెమ్మ తల్లి గుడి వద్ద మెయిన్ రోడ్ రోజు వందల వాహనాలు వెళ్లే మార్గం కావటం వల్ల ఆ చిన్నపాటి వర్షానికి సముద్రంలాగా మారిన రహదారి ప్రాంతాన్ని మరమ్మతులు తక్షణం చేయాలని ఆర్&బి అధికారులతో మాట్లాడి ప్రమాదాలను అడ్డుకట్ట వేయాలని,
  • గ్రామ పారిశుధ్య వ్యవస్థను ప్రత్యేక దృష్టి పెట్టాలని డెంగ్యూ, మలేరియా మహమ్మారి బారిన పడకుండా గ్రామ ప్రజలు కాపాడాలని.. వాటి కోసం చర్యలు తీసుకోవాలని.. అక్కడ యదార్ధ పరిస్థితులను వారికి ఫోటోలను వారికి ఇచ్చి సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడమని, గ్రామభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేయటం జరిగింది.