తెలంగాణలో టపాసులు కాల్చేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో బాణసంచా కాల్చకుండానే ఈసారి దీపావళి జరుపుకోవాలా అని వాపోతున్న ప్రజలకు, నష్టభయంతో ఆందోళన చెందుతున్న బాణసంచా విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తెలంగాణలో బాణసంచా విక్రయాలు, వినియోగంపై హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బాణసంచా నిషేధంపై ఈ నెల 9న ఎన్జీటీ మార్గదర్శకాలకు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఈ మేరకు గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసులపై నిషేధం విధించాలని ఎన్జీటీ మార్గదర్శకాల్లో పేర్కొన్నదన్న సుప్రీంకోర్టు.. కాలుష్యం సాధారణంగా ఉంటే రెండు గంటలపాటు టపాసులు కాల్చుకునే అవకాశం కల్పించింది. అలాగే కాలుష్యం సాధారణంగా ఉండే ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టలో శుక్రవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది.